అలుపన్నది వుందా
అమ్మ ప్రేమకు
అమ్మ లోని కరుణకు
తీరమన్నది వుందా
ఊహల స్రవంతికి
అమ్మ లోని ఓర్పుకి
ఓటమన్నది వుందా
ధైర్య సాహసానికి
అమ్మ లోని దుర్గ కి
దాచిన దాగేనా
మల్లెల పరిమళాలు
అమ్మ లోని మమతానురాగాలు
ఎదురుందా
దృఢ సంకల్పానికి
అమ్మ లోని నమ్మకానికి
హద్దనేది వుందా
తనయుల విజయాలలో
తన విజయమనుకొనె తన చిన్ని సంబరానికి
కవి అనేవాడు ఉండునా
అమ్మ మమత కు స్వరం కలుపుతూ
అమ్మ ఒడిని మరల ఆస్వాదించని వాడు
ఇలాంటి అద్భుతం మరేదైనా వుందా
వర్ణానికి అతీతంగా
శ్రీష్టికర్తే అసుయించెట్టు గా
గమ్యంవుందా
అపరిమితమైన ఆకాశానికి
స్వార్థం ఎరుగని అమ్మ మమకారానికి