నీ లోని ప్రేమకు రూపం నేను
నీ అందమైన అనుభవాలలో అరుదైన అనుభవం నేను
నీ వన్నె చిందులలో విహరించే విహంగం నేను

చాలించిన చాలవుగా
వయ్యారి వలపు వేదనలు
ఎన్ని సార్లు స్రవించిన
తరగవె తరుణీ మాధుర్యాలు

వదలమన్న వదలదుగా
చీర చాటు చిగురేసిన ముద్దు
ఓర చూపుతో కాటేసిన
యాగం లెని మోక్ష మార్గం

కరగని కాలమంతా
మన తనువులలో దాచిపెట్టి
లోకాన్ని నిశ్శబ్దంలో ముంచి
మన కలయికలో కరిగిపోనీ

నా లోని ప్రేమకు రూప కల్పన నువ్వు
నా తోట వసంతపు జల్లులకు కు ఆగమనం నువ్వు
నా కలల సందడి కి వెలుగొల్పిన జ్వాలవు నువ్వు